ఈ నెల 12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  • ఈ మేరకు గవర్నర్ నోటిఫికేషన్ జారీ
  • 12, 13న కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం
  • 13న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
ఈ నెల 12 నుంచి ఏపీ శాసనసభా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 12, 13న కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 13వ తేదీన శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ నెల 14న శాసనసభ, శాసన మండలి సభ్యులతో ఉభయ సభల సంయుక్తం సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజున శాసనసభలో గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 14 నుంచి శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి.
Go Back to Shorts
Andhra Pradesh
assembly
governer
narasimhan

More Telugu News