రామలింగేశ్వర స్వామి ఆలయంలో రోజా ప్రత్యేక పూజలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామలింగేశ్వర స్వామి ఆలయంలో రోజా ప్రత్యేక పూజలు

  • మణికొండలో రోజా సందడి
  • గోమాతకు పూజలు
  • సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకం
అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఘనవిజయం సాధించిన వైసీపీ నేత, సినీ నటి రోజా హైదరాబాదు శివారు మణికొండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడి పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే రోజా వేదపండితుల సమక్షంలో గోమాతకు పూజలు చేశారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా మొక్కుకున్న మొక్కులను రోజా ఈ సందర్భంగా చెల్లించుకున్నారు.

రోజా హైదరాబాద్ లో మణికొండ పంచవటి కాలనీలో నివాసం ఉంటున్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయం రోజా నివాసానికి దగ్గర్లోనే ఉంటుంది. ఎన్నికల కోసం ఇక్కడి నుంచి నగరి వెళ్లేముందే స్వామివారికి మొక్కుకుని వెళ్లారు. ఎన్నికల్లో గెలవడంతో మళ్లీ వచ్చి మొక్కు తీర్చుకున్నారు. కాగా, వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న రోజాకు అసెంబ్లీ స్పీకర్ పదవి ఖాయం అంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు, జగన్ క్యాబినెట్ లో మహిళలకు ప్రాతినిధ్యం తప్పక ఉంటుందని, అందులో రోజా పేరే మొదట ఉంటుందని కూడా మరో ప్రచారం సాగుతోంది.
Roja
YSRCP

More Telugu News