జస్ట్ నాలుగేళ్లు.. తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తాం!: బీజేపీ నేత రామ్ మాధవ్
Add ap7am to your home Screen

జస్ట్ నాలుగేళ్లు.. తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తాం!: బీజేపీ నేత రామ్ మాధవ్

  • ఇప్పుడు ఎన్నికలు జరిగినా మెజారిటీ సీట్లు మాకే
  • బెంగాల్ బీజేపీ కార్యకర్తలను స్ఫూర్తిగా తీసుకోండి
  • తెలంగాణ బీజేపీ శ్రేణులకు రామ్ మాధవ్ పిలుపు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. నిజామాబాద్ లో బీజేపీ నేత ధర్మపురి అరవింద్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మాట్లాడారు. తెలంగాణలో ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు జరిగితే బీజేపీకే మెజారిటీ స్థానాలు వస్తాయని అభిప్రాయపడ్డారు.

పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై పోరాడుతున్న సహచరుల స్ఫూర్తితో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని బీజేపీ శ్రేణులకు రామ్ మాధవ్ పిలుపునిచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పాలని అనుకున్నారనీ, కానీ వారి ఆశలు నెరవేరలేదని వ్యాఖ్యానించారు. గతంతో పోల్చుకుంటే తెలంగాణలో కమలం బాగా వికసించిందని లోక్ సభ ఫలితాలను పరోక్షంగా ప్రస్తావించారు.
Telangana
BJP
4 yrears
ram madhav
TRS

More Telugu News