తప్పిన పెను ప్రమాదం... దేవుడే బతికించాడన్న ఎమ్మెల్యే సండ్ర!
- కాలువలోకి జారిపోయిన కారు
- ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదం
- ఖమ్మం పరేడ్ గ్రౌండ్ సమీపంలో ఘటన
డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో కారు బోల్తా పడలేదు. వాహనం ఒరిగిపోతున్న సమయంలో సండ్ర, ఆయన గన్ మెన్ లు కిందకు దిగేశారు. ఆ శివుడే తన ప్రాణాలను కాపాడాడని వ్యాఖ్యానించిన సండ్ర, ఆపై తన ప్రయాణాన్ని కొనసాగించారు. తమ ఎమ్మెల్యేకు ఏమీ జరుగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.