‘భారత్’ అనే టైటిల్ సరికాదు.. వెంటనే మార్చాలి: సల్మాన్ సినిమాపై హైకోర్టులో పిటిషన్ దాఖలు

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘భారత్’. ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’కు హిందీ రీమేక్‌‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కత్రినా కైఫ్, దిశాపఠానీ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధమవుతుండగా సినిమాపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమా టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో విపిన్ త్యాగీ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.

‘భారత్’ అనే పదాన్ని సినిమాకు టైటిల్‌‌గా వాడటం సరికాదని, వెంటనే దానిని మార్చాలని విపిన్ తన పిటిషన్‌లో కోరారు. వాణిజ్య ప్రయోజనాల కోసం ‘భారత్’ అనే పదాన్ని వాడటం చిహ్నాలు, పేర్ల చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. సినిమాలో సల్మాన్ తన పేరును దేశంతో పోల్చడంపై విపిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ డైలాగ్‌ను చిత్రం నుంచి డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై చిత్రబృందం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఈ చిత్రం జూన్ 5న విడుదల కావాల్సి ఉంది.
Go Back to Shorts
Bharath
Salman Khan
Ali Abbas Jafar
Vipin Tyagi
Disha Patani
Katrina Kaif

More Telugu News