'సాహో' సంగీత దర్శకుడిగా జిబ్రాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో' సంగీత దర్శకుడిగా జిబ్రాన్

  • భారీ బడ్జెట్ చిత్రంగా 'సాహో'
  • తప్పుకున్న శంకర్ ఎహసాన్ లాయ్ 
  • కథానాయికగా శ్రద్ధా కపూర్
ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' నిర్మితమవుతోంది. భారీ బడ్జెట్ తో .. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా రూపొందుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, శంకర్ ఎహసాన్ లాయ్ ను సంగీత దర్శకులుగా తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన వీళ్లు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వాళ్లు వెల్లడించారు.

దాంతో ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎవరిని తీసుకోనున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా 'జిబ్రాన్' పేరు తెరపైకి వచ్చింది. తెలుగులో 'బాబు బంగారం' వంటి తెలుగు సినిమాలు చేసిన జిబ్రాన్ కి, తమిళంలో 'విశ్వరూపం 2' వంటి భారీ సినిమాకి పనిచేసిన అనుభవం వుంది. అందువలన 'సాహో' కోసం ఆయనని తీసుకున్నారట. మొత్తానికి జిబ్రాన్ చేతికి భారీ ప్రాజెక్టే చిక్కింది.
prabhas
shraddha kapoor

More Telugu News