సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రష్మిక ఉపయోగించే ట్రిక్ 
  • బన్నీ 'ఐకాన్' అప్ డేట్ 
  • 'ఐ లవ్ యు' అంటున్న ఉపేంద్ర
 *  ఆయా సన్నివేశాల్లో నటించేటప్పుడు చిన్న ట్రిక్ ప్రయోగిస్తానంటోంది అందాలతార రష్మిక. 'తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చినప్పుడు నటనలో నాకసలు అనుభవం లేదు. అయితే, నేను చేసేది నటనలా వుండకూడదు.. సహజత్వంతో వుండాలి అని అనుకుని, ఆయా సందర్భాలు నిజ జీవితంలో ఎదురైతే ఎలా స్పందిస్తాను? అని ఆలోచించి నటించడం మొదలెట్టాను. అదే నాకు ఇప్పుడు ఒరిజినాలిటీ తెచ్చింది. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాను' అని చెప్పింది రష్మిక.    
*  ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న అల్లు అర్జున్, మరోపక్క వేణు శ్రీరాం దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. 'ఐకాన్' పేరిట రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
*  కన్నడ నటుడు ఉపేంద్ర నటించిన 'ఐ లవ్ యు' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను త్వరలో విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. ఆర్. చంద్రు నిర్మించిన ఈ చిత్రాన్ని  తెలుగు, కన్నడ భాషల్లో వచ్చే నెల 14న విడుదల చేస్తారు.
Rashmika
Allu Arjun
Venu
Upendra

More Telugu News