నా పేరుకు ముందు 'అంబిక' అలా వచ్చి చేరింది: అంబికా కృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా పేరుకు ముందు 'అంబిక' అలా వచ్చి చేరింది: అంబికా కృష్ణ

  • మా థియేటర్లో 'పాడిపంటలు' వేశాము
  • మా థియేటర్ కి కృష్ణగారు వచ్చారు
  •  గజమాలతో ఆయనకి స్వాగతం చెప్పాను   
ఒక వైపున వ్యాపార పరంగాను .. మరో వైపున రాజకీయాల పరంగాను అంబికా కృష్ణకి మంచి పేరు వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన పేరుకి ముందు 'అంబిక' ఎలా వచ్చి చేరిందనేది వివరించారు. "కృష్ణగారు హీరోగా చేసిన సినిమాలు మా థియేటర్లో ఎక్కువగా ఆడేవి. అలా 'పాడిపంటలు' సినిమా రిలీజ్ అయినప్పుడు, ఆ సినిమాను చూడటానికి కృష్ణగారు వచ్చారు.

దాంతో నేను 'గజమాల' తెప్పించి ఆయనకి వేశాను. మరుసటి రోజు ఒక పత్రికలో 'సినిమా కృష్ణకి అంబికా కృష్ణ గజమాలతో స్వాగతం' అని రాశారు. 'అంబికా దేవి' మా ఇలవేల్పు .. ఆ పేరుతోనే 'అంబికా దర్బార్ బత్తి' ఉత్పత్తిని చేపట్టడం జరిగింది. అందువలన ఆ పత్రిక వాళ్లు 'అంబికా కృష్ణ' అని రాశారు. అలా రాయడం నాకెందుకో మంచిగా అనిపించింది. ఏ ముహూర్తాన వాళ్లు అలా రాశారో గానీ అప్పటి నుంచి 'అంబికా కృష్ణ'గానే పాప్యులర్ అయ్యాను" అని చెప్పుకొచ్చారు. 
ambika krishna

More Telugu News