చిత్రబృందం చేసిన పని కాస్త ఇబ్బందికరంగా అనిపించింది, అందుకే ‘సాహో’ నుంచి తప్పుకున్నాం: శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిత్రబృందం చేసిన పని కాస్త ఇబ్బందికరంగా అనిపించింది, అందుకే ‘సాహో’ నుంచి తప్పుకున్నాం: శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌

  • మరిన్ని పాటలను జత చేయాలని భావించింది
  • మేమే సంగీత దర్శకులుగా ఉండాలని భావించాం
  • మాకు ఇష్టం లేదని నిర్మాణ సంస్థతో చెప్పేశాం
ప్రభాస్ సినిమా 'సాహో' నుంచి సంగీత దర్శకులు తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ‘సాహో’ పూర్తవుతున్న క్రమంలో శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ తప్పుకోవడంతో అంతా షాక్ అయ్యారు. నేడు వారు తాము ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలను వివరించారు. బయటి కంపోజర్ల నుంచి మరిన్ని పాటలను జత చేయాలని చిత్రబృందం భావిస్తోందని, అది తమకు కాస్త ఇబ్బందికరంగా అనిపించిందని అన్నారు.

సినిమాకు తాము మాత్రమే సంగీత దర్శకులుగా ఉండాలని భావించామని, అందుకే తప్పుకున్నట్టు తెలిపారు. ఈ సినిమాకు మరికొందరి చేత కూడా సంగీతం చేయించాలన్న నిర్మాణ సంస్థ ఆలోచన తమకు నచ్చలేదని, అదే విషయం వారికి చెప్పేశామని, అందుకే తప్పుకున్నామని శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ తెలిపారు.
Shankar-Ahasan-LoY
Sahoo
Prabhas
Composers
Music Directors

More Telugu News