పులితో ఫైట్ చేయడానికి అదే కారణం: హీరో సుమన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పులితో ఫైట్ చేయడానికి అదే కారణం: హీరో సుమన్

  • మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను 
  • మార్షల్ ఆర్ట్స్ నా కెరియర్ కి ప్లస్ అయింది
  •  ధైర్యంగా ఫైట్స్ చేయడానికి అదే కారణం 
తాజా ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. "నేను 'చండీరాణి' అనే సినిమా చేశాను. ఆ సినిమా కోసం నేను ఒక పులితో ఫైట్ చేయాలి. ఆ సినిమా చూసినవాళ్లు 'ఆల్రెడీ అది శిక్షణ ఇచ్చిన పులి కదా అందుకే ఈజీగా చేసేశాడు' అని అంటారు. కానీ ఎంత శిక్షణ ఇచ్చినా పులి .. పులే. దానితో ఫైటింగ్ అంటే అది అంత తేలికైన విషయమేం కాదు.

పులి ఎప్పుడు రివర్స్ అవుతుందో తెలియదు. పులికి చిరాకు పుట్టేసి రివర్స్ అయిన సందర్భాలు సర్కస్ లలో చూస్తుంటాము. అలా సినిమాల్లోను జరిగే అవకాశం వుంది. అయినా భయపడకుండా నేను పులితో ఫైట్ చేశాను. రెండు రోజుల పాటు ఆ ఫైట్ ను చిత్రీకరించారు. నేను అంత ధైర్యంగా పులితో ఫైట్ చేయడానికి కారణం, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఉండటమే. నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడమనేది నా కెరియర్ కి ఈ విధంగా ప్లస్ అయింది" అని చెప్పుకొచ్చారు.  
suman

More Telugu News