ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

  • నేడు ఎన్టీఆర్ జయంతి
  • ఎన్టీఆర్ ఘాట్‌లో పూలు చల్లి నివాళులర్పించిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
  • గుంటూరు కార్యాలయంలో జయంతి వేడుకలను ప్రారంభించనున్న చంద్రబాబు
టాలీవుడ్ ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుకు నివాళులర్పించారు. నేడు ఆయన జయంతిని పురస్కరించుకుని తెల్లవారుజామున 5:30 గంటలకే ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న  నటులు ఇద్దరూ సమాధిపై పూలు చల్లి నివాళులు అర్పించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు గుంటూరు పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ప్రారంభించనున్నారు. మరోవైపు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నేతలు వాడవాడలా ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గుంటూరు కార్యాలయంలో నిర్వహించనున్న జయంతి వేడుకల్లో మాజీ మంత్రి నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పాల్గొననున్నారు.
Go Back to Shorts
NTR
Jr NTR
Kalyan Ram
birth day
Hyderabad

More Telugu News