తండ్రిని కోల్పోయిన అజయ్ దేవగణ్ .. ప్రముఖుల సంతాపం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తండ్రిని కోల్పోయిన అజయ్ దేవగణ్ .. ప్రముఖుల సంతాపం

  • స్టంట్ కొరియోగ్రఫర్ గా వీరు దేవగణ్
  • అజయ్ దేవగణ్ ఎదుగుదలలో కీలక పాత్ర
  • దర్శక నిర్మాతగాను అనుభవం  
బాలీవుడ్ తెరపై యాక్షన్ హీరోగా అజయ్ దేవగణ్ ఎదగడం వెనుక, ఆయన తండ్రి వీరు దేవగణ్ కృషి వుంది. అజయ్ దేవగణ్ ను హీరోగా నిలబెట్టడానికి ఆయన ఎంతో కృషి చేశారు. అలా అజయ్ దేవగణ్ ఎదుగుదలలో కీలకమైన పాత్రను పోషించిన వీరు దేవగణ్ ఈ రోజున మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతోన్న ఆయన, ఈ రోజున ముంబైలోని సూర్య హాస్పిటల్లో చికిత్సపొందుతూ మరణించారు.

బాలీవుడ్ లో ఎన్నో భారీ చిత్రాలకు స్టంట్ కొరియో గ్రఫర్ గా ఆయన పనిచేశారు. యాక్షన్ సినిమాలకి సంబంధించి తనదైన ముద్ర వేశారు. పలు చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, అజయ్ దేవగణ్ తో 'హిందుస్థాన్ కీ కసమ్' అనే సినిమాకి దర్శకత్వం కూడా చేశారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విలే పార్లే శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
veeru devagan
ajay devagan

More Telugu News