Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాన్నకి సాయం చేయడానికి కృష్ణగారు ముందుకు వచ్చారు: కాంతారావు కుమారుడు రాజా

  • ఒక సినిమా రిలీజ్ లేట్ అయింది
  • వడ్డీలు పెరగడం వలన ఆర్ధిక భారం
  •  కృష్ణగారు చెప్పినా నాన్న వినలేదు
తాజా ఇంటర్వ్యూలో కాంతారావు తనయుడు రాజా మాట్లాడుతూ, అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. "నాన్న తీసిన అయిదు సినిమాలు ఆర్ధికంగా నష్టాలను తెచ్చిపెట్టాయి. 'ప్రేమజీవులు' అనే ఒక సినిమా కృష్ణగారితో తీశారు .. అది ఆడదు అని కృష్ణగారు ముందుగానే చెప్పినా నాన్న వినిపించుకోలేదు.

మరో సినిమాను అనుకున్న సమయానికి విడుదల కాకుండా కొన్ని శక్తులు అడ్డుకున్నాయి. దాంతో వడ్డీలు పెరిగిపోయి, ఆ సినిమా కోలుకొని దెబ్బతీసింది. ఆ సమయంలో కృష్ణగారు "కాంతారావుగారూ గతంలో నాతో సినిమా తీసి మీరు నష్టపోయారు. నేను మీకు డేట్స్ ఇస్తాను .. నాతో ఒక సినిమా తీసుకోండి. మీరు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు .. నేను హీరో అంటే ఫైనాన్స్ చేసే వాళ్లు వస్తారు" అని అన్నారు. కానీ అప్పటికే వచ్చిన నష్టాల వలన నాన్న ఇక సినిమాల నిర్మాణం జోలికి వెళ్లకూడదని అనుకున్నారు. అందువలన కృష్ణగారితో రెండో సినిమా చేయలేదు" అని చెప్పుకొచ్చారు.
raja
kantha rao

More Telugu News