పవన్ కల్యాణ్ టాలీవుడ్ రీఎంట్రీపై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కల్యాణ్ టాలీవుడ్ రీఎంట్రీపై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • పవన్ ఎంతో నిజాయతీపరుడు
  • ఎంతో శక్తితో నిర్ణయాలు తీసుకోగలడు
  • రాజకీయాల్లో కొనసాగే విషయంలో స్పష్టంగా చెప్పలేను
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన, పవన్ కల్యాణ్ భవితవ్యంపై ఓ చానల్ న్యూస్ ప్రజంటర్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. పవన్ రాజకీయాల్లో కొనసాగితే బాగుంటుందా? లేక, సినిమాల్లోకి తిరిగొస్తే బాగుంటుందా? అని చానల్ ప్రతినిధి అడిగారు.

దానికి వర్మ బదులిస్తూ, "పవన్ ఎంతో నిజాయతీ ఉన్న వ్యక్తి. నికార్సయినవాడు. అయితే నేను పవన్ కల్యాణ్ కు సలహా ఇస్తున్నానని భావించడంలేదు. నా అభిప్రాయం మాత్రం చెప్పగలను. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ ఓ డిక్టేటర్ అవగలడు, అంటే, అది చెడుగా కాదు, పాజిటివ్ గానే పవన్ ఓ తిరుగులేని శక్తి లాంటి వాడు. ఎందుకంటే ఇప్పుడు పవన్ ఎవరితోనూ పొత్తులో లేడు, తానొక్కడే ఉన్నాడు కాబట్టి, ఎలాంటి నిర్ణయమైనా ధైర్యంగా తీసుకోగలిగే శక్తి ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో అలాంటి నిర్ణయాలు కరెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి, కొన్ని సందర్భాల్లో అవి తప్పు అవొచ్చు. అదేం పెద్ద విషయం కాదు, ఇతరుల నిర్ణయాలు కూడా తప్పుతున్నాయి కదా!

ఒక సూపర్ స్టార్ గా వచ్చి ఇంతటి నిరాశాజనక ఫలితాన్ని చవిచూసినప్పుడు పవన్ కల్యాణ్ కు అర్థమయ్యే ఉంటుంది. ఈ ఐదేళ్లలో తాను ఎంతోమందిని డీల్ చేసి ఉంటాడు. రాజకీయాల్లో ఇమడగలనా? లేదా? అనేది దాన్నిబట్టే తాను అర్థంచేసుకోవాలి. అమితాబ్ బచ్చన్ అంతటివాడే రాజకీయాల్లోకి సరిపడనని నిర్ధారించుకున్నాడు. అయితే అమితాబ్ లా కాకుండా పవన్ నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ తన వ్యక్తిత్వంతో పార్టీని నడిపించగలడా? లేక, సినిమాల్లోకి తిరిగి వస్తాడా? అంటే దానిపై నేను స్పష్టంగా చెప్పలేను" అంటూ వ్యాఖ్యానించారు.
RGV

More Telugu News