తండ్రి చేతిలో తనయుడు హతం...చంపాలని వచ్చి తనే ప్రాణాలు కోల్పోయాడు
- మద్యం మత్తులో తండ్రిపై ఆగ్రహం
- వివాదంలో ప్రాణాలు కోల్పోయిన వైనం
- గత కొన్నాళ్లుగా, భార్య, తండ్రితో వివాదం
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి పూటుగా మద్యం తాగిన రాజు తండ్రిని ఉరివేసి చంపేస్తానంటూ తాడు పట్టుకుని ఇంటికి వచ్చాడు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఘర్షణ పడగా రాజు తండ్రి బుచ్చయ్య కొడుకు తెచ్చిన తాడు అతని మెడకే చుట్టి హత్య చేశాడు. బుచ్చయ్య భార్య నర్సవ్వ శనివారం ఉదయం కోడలికి ఫోన్‌చేసి భర్త చనిపోయిన విషయం తెలియజేయడంతో ఆమె హుటాహుటిన ఇంటికి చేరుకుంది. మామ బుచ్చయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.