తెలంగాణలో నాలుగు లోక్ సభ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం!
- ఆధిక్యంలో ఉత్తమ్, బండి సంజయ్
- చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి దూకుడు
- తెలంగాణలో 9 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యం
సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి 35,000 ఓట్ల మెజారిటీతో సాగుతున్నారు. చేవెళ్లలో కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి 8,000 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 9 చోట్ల టీఆర్ఎస్ లీడింగ్ లో ఉండగా, కాంగ్రెస్ 3, బీజేపీ 4, మజ్లిస్ పార్టీ ఓ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మరోవైపు ఏపీలోని చీరాలలో వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ అభ్యర్థి చేతిలో వెనుకపడ్డారు.