ఆమధ్య గుణశేఖర్ పై కోర్టుకు వెళ్లడానికి అదే కారణం: హీరో సుమన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆమధ్య గుణశేఖర్ పై కోర్టుకు వెళ్లడానికి అదే కారణం: హీరో సుమన్

  • 'రుద్రమదేవి'లో విలన్ గా చేశాను
  • నా పాత్ర ప్రాధాన్యతను తగ్గించారు
  •  డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రుద్రమదేవి' సినిమాలో, సుమన్ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. ఆ సినిమా సమయంలో పది లక్షలకుగాను తనకి గుణశేఖర్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందంటూ సుమన్ కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి సుమన్ ప్రస్తావించారు.

ఈ సినిమా క్లైమాక్స్ లో నాకు .. అనుష్కకి మధ్య భారీ యాక్షన్ సీన్ ఉంటుందని గుణశేఖర్ చెప్పారు. ఆ యాక్షన్ ఎపిసోడ్ ఉందనే ఉద్దేశంతోనే నేను ఆ సినిమాను అంగీకరించాను. కానీ చివరికి వచ్చేసరికి ఆ యాక్షన్ సీన్ లేకుండా చేశారు. అలా నా పాత్ర రేంజ్ ను తగ్గించి నన్ను అవమానపరిచారు. ఇక డబ్బులు కూడా తరువాత ఇస్తామంటూ చాలాసార్లు వాయిదా వేశారు. కేవలం డబ్బు విషయమే అయితే నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కానీ నా పాత్ర ప్రాధాన్యతను తగ్గించడం నాకు బాధ కలిగించింది. అందుకే కోర్టుకు వెళ్లి నాకు రావలసిన మొత్తాన్ని రాబట్టుకున్నాను"  అని చెప్పుకొచ్చారు.
suman

More Telugu News