100 కిలోల బరువును అవలీలగా ఎత్తిన సమంత!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

100 కిలోల బరువును అవలీలగా ఎత్తిన సమంత!

  • సమంత వర్కౌట్ వీడియోకు విశేష స్పందన
  • జిమ్ లో 100 కేజీల బరువుతో అమ్మడు వ్యాయామం
  • ఫిట్ నెస్ కోసం సమంత తపన
ఇటీవలకాలంలో హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, నాజూకైన రూపాన్ని, శారీరక దారుఢ్యాన్ని కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. అలాంటివారిలో సమంత అక్కినేని ఒకరు. నాగచైతన్యతో పెళ్లికి ముందు అగ్రహీరోలందరితో నటించిన సమంత ప్రస్తుతం కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తోంది. అందుకు అనుగుణంగా ఆమె తనను తాను మలుచుకుంటున్న తీరు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఫిట్ నెస్ కు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చే సమంత తాజాగా 100 కిలోల బరువును సునాయాసంగా ఎత్తి ఔరా అనిపించింది. తన జిమ్ వర్కౌట్ లో భాగంగా సమంత అంత బరువును ఎత్తుతూ వ్యాయామం చేయడం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను సమంత ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయగా, అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.

Samantha
Tollywood

More Telugu News