కోడలు పిల్లతో పని చేయడం అద్భుతంగా, సరదాగా ఉంది: నాగ్
- రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’
- సామ్‌తో తీసుకున్న ఫొటోను షేర్ చేసిన నాగ్
- మరిన్ని ఫొటోలు విడుదల కాబోతున్నాయంటూ ట్వీట్
‘‘మన్మథుడు 2’ కోసం కోడలు పిల్ల సమంతతో కలిసి పనిచేయడం అద్భుతంగా, సరదాగా ఉంది. మరిన్ని ఫొటోలు విడుదల కాబోతున్నాయి’ అంటూ నాగ్ ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో కారుకు ఆనుకుని తనకు, నాగ్‌కు గొడుగు పట్టుకుని సామ్ కనిపించింది. ఇద్దరూ నవ్వుతూ ఉన్న ఆ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరో ఫొటోను కూడా చిత్రబృందం నేడు విడుదల చేసింది. ఇటీవల పోర్చుగల్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే మరో షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది.