'భారతీయుడు 2' గురించి క్లారిటీ ఇచ్చిన కాజల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'భారతీయుడు 2' గురించి క్లారిటీ ఇచ్చిన కాజల్

  • కాజల్ ప్రధాన పాత్రధారిగా 'సీత'
  • త్వరలో విడుదలకి మరో రెండు సినిమాలు
  •  జూన్ నుంచి 'భారతీయుడు 2'  
తేజ దర్శకత్వంలో కాజల్ 'సీత' సినిమా చేసింది. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాను, ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్ తో కాజల్ తీరికలేకుండా వుంది. 'సీత' సినిమాను గురించి మాట్లాడుతూనే, తన తదుపరి సినిమాలను గురించి ఆమె ప్రస్తావించింది.

తెలుగులో శర్వానంద్ తో ఒక సినిమాను .. తమిళంలో జయం రవితో ఒక సినిమాను పూర్తి చేశాను. త్వరలోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక 'భారతీయుడు 2' ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారంలో నిజం లేదు. రాజకీయాలతో కమల్ గారు బిజీగా ఉండటం వల్లనే బ్రేక్ ఇచ్చారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు జరగనుంది. ఈ సినిమా షూటింగులో ఎప్పుడెప్పుడు పాల్గొంటానా అని ఎంతో ఆత్రుతగా వుంది. ఇక కథాకథనాలు నచ్చితే 'సీత' మాదిరిగా మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనే ఆలోచన వుంది" అని చెప్పుకొచ్చింది. 
kamal
kajal

More Telugu News