బాలకృష్ణ సరసన పాయల్ రాజ్ పుత్?
- త్వరలో సెట్స్ పైకి 'రూలర్'
- ప్రతినాయకుడిగా జగపతిబాబు
- ఒక కథానాయికగా హరిప్రియ
'ఆర్ ఎక్స్ 100' సినిమాతో పరిచయమైన ఈ సుందరి, గ్లామర్ పరంగా ఫుల్ మార్కులు కొట్టేసింది. 'వెంకీమామ' .. 'డిస్కో రాజా' సినిమాల్లో ఛాన్సులు పట్టేసింది. తాజాగా బాలకృష్ణ సినిమాలోను అవకాశాన్ని దక్కించుకుందని అంటున్నారు. ఈ సినిమాకి 'రూలర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రతినాయక పాత్ర కోసం జగపతిబాబును తీసుకున్న విషయం తెలిసిందే.