ఎన్టీఆర్ గారు అలా అడగడంతో ఒక్కసారిగా బిత్తరపోయాను: సీనియర్ డాన్స్ మాస్టర్ శ్రీను
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ గారు అలా అడగడంతో ఒక్కసారిగా బిత్తరపోయాను: సీనియర్ డాన్స్ మాస్టర్ శ్రీను

  • 'చిలక కొట్టుడు కొడితే' పాట చిత్రీకరిస్తున్నాము 
  • ఎన్టీఆర్ చాలా కష్టపడి చేస్తున్నారు 
  • కాంప్రమైజ్ కావొద్దని నాతో అన్నారు
 తాజా ఇంటర్వ్యూలో డాన్స్ మాస్టర్ శ్రీను మాట్లాడుతూ, 'యమగోల' సినిమా షూటింగు సమయంలో జరిగిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించారు. 'యమగోల' సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ - జయప్రద కాంబినేషన్లో 'చిలక కొట్టుడు కొడితే .. ' పాటను నెల్లూరుకు సమీపంలోని ఒక విలేజ్ లో చిత్రీకరిస్తున్నాము. నేను చెప్పిన స్టెప్పులను ఆయన చాలా కష్టపడి చేశారు .. షాట్ ఓకే అని చెప్పాను.

కానీ ఎన్టీ రామారావుగారు నా దగ్గరికి వచ్చి 'మళ్లీ ఒకసారి చేద్దాం బ్రదర్' అన్నారు. అలాగేనని చెప్పడంతో మళ్లీ ఆయన ఆ స్టెప్పులు వేశారు. నేను షాట్ ఓకే అని చెప్పగానే  'ఇందాకటిది బాగుందా? .. ఇప్పటిది బాగుందా?' అని అడిగారాయన. 'ఇప్పటిదే బాగుందిసార్' అన్నాను నేను. మరి అలాంటప్పుడు ఇందాక ఎలా ఓకే చెప్పారు? అని అడిగారు. దాంతో 'సార్ .. ' అంటూ నసిగాను నేను. ఆ తరువాత నా భుజంపై చేయివేసి 'ఎప్పుడూ కాంప్రమైజ్ కావొద్దు బ్రదర్ .. మేము చేయడానికి సిద్ధంగా వున్నాము గదా' అని అన్నారంటూ చెప్పుకొచ్చారు.
srinu master
ntr

More Telugu News