అంతర్జాతీయ క్రికెట్ తొలి మహిళా రెఫరీగా తెలుగు మహిళ నియామకం
- తొలి మహిళా మ్యాచ్ రెఫరీగా జీఎస్ లక్ష్మి నియామకం
- డొమెస్టిక్ క్రికెట్లో పలు మ్యాచ్ లకు రెఫరీగా పని చేసిన లక్ష్మి
- ఐసీసీ, బీసీసీఐలకు ధన్యవాదాలు తెలిపిన లక్ష్మి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ ప్యానల్ లో చోటు దక్కించుకోవడాన్ని తాను అత్యంత గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇండియన్ క్రికెటర్ గా, దేశీయ మ్యాచ్ రెఫరీగా తనకు ఎంతో అనుభవం ఉందని తెలిపారు. ఈ అనుభవాన్ని అంతర్జాతీయ వేదికపై ఉపయోగించుకుంటానని చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఐసీసీ, బీసీసీఐలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.