ఐస్ హాకీ గేమ్ లో అపశ్రుతి.. ఒక్కసారిగా పడిపోయిన రష్యా అధ్యక్షుడు పుతిన్!
- రష్యాలోని సోచిలో ఘటన
- ఎగ్జిబిషన్ మ్యాచ్ లో ప్రజలకు అభివాదం
- ఏకంగా 8 గోల్స్ కొట్టిన పుతిన్
ఈ సందర్భంగా సభికులకు అభివాదం చేస్తూ వేగంగా వెళుతున్న పుతిన్ ఒక్కసారిగా అదుపు తప్పి పడిపోయారు. దీంతో పక్కనే ఉన్న సిబ్బంది పుతిన్ ను పైకిలేపారు. నవ్వుతూ పైకిలేచిన పుతిన్ ఏమీ జరగనట్లు ప్రేక్షకులకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. అన్నట్లు ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో పుతిన్ 8 గోల్స్ కొట్టినట్లు రష్యా మీడియా తెలిపింది. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచారు? అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.