కోడల్ని వేధించే అత్తలాగా చంద్రబాబు అధికారంలో లేకున్నా విరాళాలు ఇస్తున్నారు: విజయసాయిరెడ్డి
Add ap7am to your home Screen

కోడల్ని వేధించే అత్తలాగా చంద్రబాబు అధికారంలో లేకున్నా విరాళాలు ఇస్తున్నారు: విజయసాయిరెడ్డి

  • ఒడిశాకు రూ.15 కోట్లు సాయం ప్రకటించడంపై ట్వీట్
  • ఆ డబ్బును చంద్రబాబు తాను దోచుకున్న సొమ్మునుంచి ఇవ్వాలి
  • చంద్రబాబు మాయావిన్యాసాలు బయటపడ్డాయి
వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఫణి తుపాను ప్రభావానికి గురైన ఒడిశా రాష్ట్రానికి చంద్రబాబు రూ.15 కోట్లు ప్రకటించడంపై ఆయన స్పందించారు. చంద్రబాబు ఆ రూ.15 కోట్లను తాను దోచుకున్న సొమ్ము నుంచి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఓవైపు అధికారులు ఎంతో సమర్థవంతంగా వ్యవహరించి ప్రాణనష్టం లేకుండా చేస్తే, కోడల్ని వేధించే అత్తలాగా చంద్రబాబు అధికారంలో లేకపోయినా విరాళం ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒడిశా వెళ్లి హడావుడి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యంగ్యం ప్రదర్శించారు.

అంతేగాకుండా, గతంలో తిత్లీ తుపాను వచ్చినప్పుడు చంద్రబాబు రూ.3673 కోట్ల నష్టం జరిగినట్టు కేంద్రానికి నివేదిక ఇచ్చారని, ఇప్పుడు సూపర్ సైక్లోన్ స్థాయిలో వచ్చిన ఫణి కారణంగా వంద కోట్లు కూడా నష్టం జరగకపోవడం చూస్తుంటే తిత్లీ సమయంలో చంద్రబాబు మాయా విన్యాసాలు చేసినట్టు అర్థమవుతోందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Chandrababu
Vijay Sai Reddy

More Telugu News