వీరాభిమానం: కుమారుడి పెళ్లి పత్రికపై బాలకృష్ణ ఫొటోను ముద్రించుకున్న కర్ణాటక అభిమాని
Add ap7am to your home Screen

వీరాభిమానం: కుమారుడి పెళ్లి పత్రికపై బాలకృష్ణ ఫొటోను ముద్రించుకున్న కర్ణాటక అభిమాని

  • తన కుమారుడి పెళ్లి శుభలేఖపై బాలయ్య ఫొటోలు
  • బాలయ్య అభిమానులందరూ పెళ్లికి రావాలని పిలుపు
  • నూతన దంపతులకు బాలయ్య ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయన్న అభిమాని
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కర్ణాటకకు చెందిన శ్రీనివాసులు మాత్రం బాలయ్యపై తనకున్న అభిమానాన్ని మరోలా చాటుకున్నాడు. తన కుమారుడి పెళ్లి శుభలేఖపై అభిమాన హీరో ఫొటోను ముద్రించి బాలయ్య అంటే తనకెంత ఇష్టమో నిరూపించాడు.

ఈ నెల 13న జరగనున్న తన కుమారుడి పెళ్లికి బాలయ్య, నందమూరి అభిమానులు హాజరై ఆశీర్వదించాలని కోరాడు. వివిధ గెటప్‌లలో ఉన్న బాలకృష్ణ ఫొటోలను శుభలేఖపై ముద్రించాడు. అంతేకాదు, నూతన దంపతులకు బాలయ్యబాబు ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని ఫొటోల కింద రాసుకొచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పెళ్లి శుభలేఖను చూసిన బాలయ్య అభిమానులు పొంగిపోతున్నారు.
Balakrishna
Tollywood
wedding card
Karnataka

More Telugu News