మందుల తయారీలో దారుణం.. హైదరాబాద్ ల్యాబ్ గుట్టు రట్టు!

  • మందుల తయారీలో కెటమైన్ డ్రగ్
  • మానవ మృగంలా మారతాడని వెల్లడి
  • ఐదు గంటల పాటు అపస్మారక స్థితిలోనే..
మందుల తయారీలో కెటమైన్ అనే డ్రగ్‌ను వాడుతున్న హైదరాబాద్ కు చెందిన ఓ ల్యాబ్‌ను నేడు అధికారులు సీజ్ చేశారు. బెంగుళూరులో అరెస్టయిన ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన కీలక సమాచారంతో నాచారంలోని ‘ఇంతం’ ల్యాబ్‌లో డ్రగ్ కంట్రోల్ బోర్డు సోదాలు నిర్వహించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. దీంతో ఈ ల్యాబ్, డ్రగ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మందుల తయారీలో కెటమైన్ అనే డ్రగ్ వాడటమే కాకుండా, వాటితో మహిళలపై ప్రయోగాలు నిర్వహిస్తున్నారని విచారణలో స్పష్టమైంది. ఈ డ్రగ్ తీసుకున్న వ్యక్తిలో సెక్స్ హార్మోన్లు పెరిగి, మృగంలా మారతాడని అధికారులు వెల్లడించారు. దీంతో పాటు ఈ డ్రగ్‌ను తీసుకున్న వ్యక్తి దాదాపు ఐదు గంటల పాటు అపస్మారక స్థితిలోనే ఉంటాడని అధికారులు వెల్లడించారు. అధికారులు ల్యాబ్‌ను సీజ్ చేసి, దాని యజమాని వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Go Back to Shorts
Ketamine
Drug
Bengulore
Intham Lab
Harmones
Venkatesh

More Telugu News