'ఎర్రగడ్డకు దారేది' పేరిట త్వరలోనే వర్మ జీవితంపై బయోపిక్ తీస్తా!: దేవీబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఎర్రగడ్డకు దారేది' పేరిట త్వరలోనే వర్మ జీవితంపై బయోపిక్ తీస్తా!: దేవీబాబు

  • వర్మపై నిప్పులు చెరిగిన దేవీబాబు
  • వాడైనా చావాలి, లేదా నేనైనా 
  • ఊరకుక్క అరిస్తే ఎలా ఉంటుందో వర్మ అరిస్తే అలా ఉంటుంది
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిలిపివేయాలంటూ కొన్నాళ్ల క్రితం తెలంగాణ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ద్వారా దేవీబాబు చౌదరి అనే తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు వార్తల్లోకెక్కారు. ఆయన చంద్రబాబుకు వీరాభిమాని. ఇటీవల లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కోసం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్న ప్రయత్నాలు, సీఎం చంద్రబాబుపై చేస్తున్న వ్యాఖ్యలు దేవీబాబుకు కోపం తెప్పించాయి. ఆయన ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మపై నిప్పులు చెరిగారు.

చంద్రబాబునాయుడ్ని ఎవరు అవమానించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. "ఒరే వర్మా! నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తాట తీస్తా" అంటూ మండిపడ్డారు. వర్మ అఖిల భారత పిచ్చ సంఘం అధ్యక్షుడని, ఊరకుక్క అరిస్తే ఎలా ఉంటుందో వర్మ అరిస్తే అలా ఉంటుందని విమర్శించారు. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని జగన్ కోసం తీశారని, వర్మకు పిచ్చెక్కడంతోనే అనేక విధాల బయోపిక్ లు తీస్తున్నారంటూ దేవీబాబు ఎద్దేవా చేశారు.

 తాను త్వరలో వర్మ జీవితం ఆధారంగా 'ఎర్రగడ్డకు దారేది' టైటిల్ తో ఓ బయోపిక్ తీస్తున్నానని వెల్లడించారు. వర్మ పిచ్చి ఏ స్థాయిలో ఉంటుందో తన చిత్రంలో చూడొచ్చని అన్నారు. వర్మపై తాను చేస్తున్న పోరాటం ఇప్పట్లో ఆగదని, "వాడైనా చనిపోవాలి లేక నేనైనా చావాలి" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
RGV
Devibabu

More Telugu News