ఐరోపాకు బయల్దేరనున్న కీర్తి సురేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐరోపాకు బయల్దేరనున్న కీర్తి సురేశ్

  • 'మహానటి'తో హిట్ కొట్టిన కీర్తి సురేశ్ 
  • కథపై నమ్మకంతో కొత్త దర్శకుడికి ఛాన్స్ 
  • వచ్చేనెలలో ఐరోపా షెడ్యూల్ 
నయనతార .. అనుష్క .. త్రిష వంటి స్టార్ హీరోయిన్స్ తొలినాళ్లలో గ్లామరస్ పాత్రలకి ప్రాధాన్యతనిచ్చారు. తమ అందచందాలతో యూత్ హృదయాలను కొల్లగొట్టేశారు. ఒక దశాబ్ద కాలం తరువాత నాయికా ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపడం మొదలుపెట్టారు. అలా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లోను తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

కానీ కీర్తి సురేశ్ మాత్రం కెరియర్ తొలినాళ్లలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి ప్రాధాన్యతనిస్తూ ఉండటం విశేషం. 'మహానటి'తో మంచి మార్కులు తెచ్చేసుకున్న ఆమె, ప్రస్తుతం నరేంద్రనాథ్ అనే నూతన దర్శకుడితో ఒక తెలుగు సినిమా చేస్తోంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమా మేజర్ షెడ్యూల్ షూటింగును, ఐరోపాలో ప్లాన్ చేశారు. ఈ నెల తరువాత ఈ సినిమా టీమ్ అక్కడికి వెళ్లనుంది. 45 రోజుల పాటు ఏకధాటిగా అక్కడ షూటింగు జరుపుతారట. ఒక కొత్త దర్శకుడితో చేయడానికి కీర్తి సురేశ్ ఒప్పుకోవడం విశేషమని చెప్పుకుంటున్నారు. 
keerti suresh

More Telugu News