నా వల్లనే నజ్రియా పెళ్లి జరిగింది: నిత్యామీనన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా వల్లనే నజ్రియా పెళ్లి జరిగింది: నిత్యామీనన్

  • మలయాళంలో 'బెంగుళూర్ డేస్' చేసే ఛాన్స్ వచ్చింది
  •  డేట్స్ లేకపోవడం వలన కుదరలేదు
  •  నా స్థానంలో నజ్రియాకి ఛాన్స్    
తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా నజ్రియాకి యూత్ లో మంచి క్రేజ్ ఉండేది. అలాంటి నజ్రియా వివాహం ఫాహద్ ఫాసిల్ తో జరగడానికి కారకురాలిని తనేనని తాజా ఇంటర్వ్యూలో నిత్యామీనన్ చెప్పింది. "మలయాళంలో 'బెంగుళూర్ డేస్'  సినిమా చేసే ఛాన్స్ నాకు వచ్చింది. అప్పటికే ఆ సినిమా కోసం దుల్కర్ సల్మాన్ .. ఫాహద్ ఫాసిల్ .. నవీన్ పౌలి .. పార్వతిని తీసుకున్నారు.

ఆ సమయంలో నా డేట్స్ ఖాళీ లేకపోవడం వలన, నేను ఆ సినిమా చేయలేనని చెప్పాను. దాంతో నాకు బదులుగా నజ్రియాను తీసుకున్నారు. ఈ సినిమా షూటింగు సమయంలోనే నజ్రియా .. ఫాహద్ ఫాసిల్ మధ్య పరిచయం ప్రేమగా మారడం .. పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది. నేను ఆ సినిమా చేయకపోవడం వల్లనే తమ పెళ్లి జరిగిందని నేను ఎదురుపడినప్పుడల్లా నజ్రియా - ఫాహద్ ఫాసిల్ చెబుతుంటారు. వాళ్ల పెళ్లికి పరోక్షంగా నేను కారణమయ్యానని చెబుతున్నప్పుడల్లా నాకు ఆనందం కలుగుతూ ఉంటుంది" అని చెప్పుకొచ్చింది. 
nithyamenon

More Telugu News