మా నాయకులను కొనడం మీరు అనుకున్నంత ఈజీ కాదు: కేజ్రీవాల్
Add ap7am to your home Screen

మా నాయకులను కొనడం మీరు అనుకున్నంత ఈజీ కాదు: కేజ్రీవాల్

  • విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడమేనా మీ పని?
  • ప్రజాస్వామ్యం అంటే అర్థం ఇదేనా?
  • మా ఎమ్మెల్యేలను కొనేందుకు ఎన్నో సార్లు ప్రయత్నించారు
14 మంది ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారన్న కేంద్ర మంత్రి విజయ్ గోయల్ వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ మండిపడ్డారు. తమ నాయకులను కొనడం అంత సులభం కాదని ఆయన అన్నారు. 'గోయల్ సాబ్... మీ కొనుగోలు వ్యవహారం ఎక్కడ వరకు వచ్చింది? మీరు ఎంత చెల్లిస్తున్నారు? మా వాళ్లు ఎంత డిమాండ్ చేస్తున్నారు?' అంటూ ఎద్దేవా చేశారు.

వివిధ రాష్ట్రాల్లోని మీ వ్యతిరేక పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడమేనా మీ లక్ష్యం అంటూ ప్రధాని మోదీనీ కేజ్రీవాల్ ప్రశ్నించారు. మీ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే అర్థం ఇదేనా? అని అడిగారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేంత డబ్బును మీరు ఎక్కడ నుంచి తెస్తున్నారని ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు మీరు ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యారని... తమ ఎమ్మెల్యేలను కొనడం అంత ఈజీ కాదని అన్నారు.
kejriwal
modi
vijay goyal
aap
mlas

More Telugu News