స్క్రిప్టుకు, అభిమానులకు లింకు పెట్టిన ప్రభాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్క్రిప్టుకు, అభిమానులకు లింకు పెట్టిన ప్రభాస్

  • నేషనల్ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ
  • ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి పాత్రలే ఎంచుకుంటా
  • ప్రజల ప్రేమాభిమానాలు పొందడం అదృష్టమంటూ వ్యాఖ్య
సాహో చిత్రంతో ఎంతో బిజీగా ఉన్న ప్రభాస్ ఓ నేషనల్ మ్యాగజైన్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎక్కువగా అభిమానుల గురించే మాట్లాడారు. ప్రేక్షకులు తనను ఈ స్థాయిలో ప్రేమించడం, ఆదరించడాన్ని అదృష్టంగా భావిస్తానని చెప్పారు. తాను స్క్రిప్ట్ ఎంపిక చేసుకునేప్పుడు అభిమానులనే దృష్టిలో పెట్టుకుంటానని, వారు తనను ఎలాంటి పాత్రలో చూడాలనుకుంటున్నారో ఆలోచించి, అలాంటి పాత్ర ఉన్నట్టయితేనే ఆ స్క్రిప్ట్ కు ఆమోదముద్ర వేస్తానని వెల్లడించారు.

బాహుబలి తర్వాత ఫ్యాన్స్ తన నుంచి ఎంతో ఆశిస్తుంటారని, వారి అంచనాలు అందుకోవడంపైనే దృష్టి పెడతానని చెప్పారు. "చాలావరకు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. పాత్రలో నేను ఇమిడిపోగలనా? అనే విషయం ఆలోచిస్తాను. అయితే అది అభిమానులకు నచ్చే విధంగా ఉంటుందనిపిస్తేనే ఓ సినిమా అంగీకరిస్తాను" అంటూ వివరించారు.
Prabhas
Tollywood

More Telugu News