దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు లేఖ రాసిన ద్వివేది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు లేఖ రాసిన ద్వివేది

  • దేశంలో పొలిటికల్ బయోపిక్ లపై ఈసీ నిషేధం ఉంది
  • కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించాల్సిందే
  • వర్మ ఆశలపై నీళ్లు చల్లిన ద్వివేది
రేపు ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉత్సాహంపై ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది నీళ్లు చల్లారు. ఈ మేరకు వర్మకు ద్వివేది ఓ లేఖ రాశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై అడ్డంకులు తొలగించాలంటూ వర్మ చేసిన అభ్యర్థనకు ద్వివేది లేఖ ద్వారా స్పందించారు.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో అన్ని పొలిటికల్ బయోపిక్ లను నిషేధిస్తూ ఏప్రిల్ 10న ఆదేశాలు జారీచేసిందని, ఈసీఐ ఆదేశాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందేనని ద్వివేది తన లేఖలో పేర్కొన్నారు. తాజాగా ద్వివేది లేఖ రాసిన నేపథ్యంలో వర్మకు ఇది నిరుత్సాహం కలిగించే విషయం అని చెప్పాలి.  
RGV
Andhra Pradesh

More Telugu News