వర్మా! నీ కప్ప కనుగుడ్లను తెలుగింటి ఆడపడుచులు పీకిపడేస్తారు, జాగ్రత్త!: దివ్యవాణి ఫైర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వర్మా! నీ కప్ప కనుగుడ్లను తెలుగింటి ఆడపడుచులు పీకిపడేస్తారు, జాగ్రత్త!: దివ్యవాణి ఫైర్

  • మేం సంస్కారవంతుడైన నాయకుడి వద్ద పనిచేస్తున్నాం
  • నీపై విమర్శలు చేయడానికి కూడా ఆలోచించాల్సి వస్తోంది
  • కోడికత్తి పార్టీపై ఆసక్తి కలిగితే పార్టీలో చేరి కండువా కప్పుకో
ఎన్నికల వేడి కారణంగా రాజకీయ పార్టీలు, ప్రజలు తీవ్ర ఆవేశంలో ఉన్న తరుణంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీలో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు సరికాదంటూ టీడీపీ ఫైర్ బ్రాండ్ దివ్యవాణి తీవ్రస్థాయిలో స్పందించారు. వర్మ ప్రెస్ మీట్ పెడితే తలెత్తే పరిణామాలు, అల్లర్లను పోలీసులు ఊహించే ఆయనను అడ్డుకున్నారని, పోలీసులు మంచి పనిచేశారని కితాబిచ్చారు.

ఏపీలో 144 సెక్షన్ అమలులో ఉన్న సమయంలో ప్రెస్ మీట్ పెట్టుకుంటానని వచ్చిన వర్మ, తనను పోలీసులు ఆపారని, అందుకు చంద్రబాబే కారణమని ఆరోపించడాన్ని దివ్యవాణి తప్పుబట్టారు. చంద్రబాబుపై నింద మోపడం చాలా బాధకరమని అన్నారు.

"వర్మ గారూ, ఇవాళ మీపై విమర్శలు చేయడానికి కూడా ఎంతో ఆలోచించాల్సి వస్తోంది. ఓ సంస్కారవంతుడైన నాయకుడి వద్ద మేం పనిచేస్తున్నాం. అందుకే ఎంతో బాధతో మాట్లాడాల్సి వస్తోంది. జాగ్రత్త! నీ కప్ప కనుగుడ్లని తెలుగింటి ఆడపడుచులు పీకిపడేసి నిన్ను కళ్లు లేని కబోదిని చేస్తారు. ఒక పసిబిడ్డ తల్లి వద్ద పాలు తాగుతున్నా కూడా దాన్నొక బూతుగా చిత్రీకరించే నీచ మనస్తత్వం నీది.

ఒకవేళ నీకు కోడికత్తి పార్టీ మీద ఆసక్తి కలిగితే ధైర్యంగా కండువా కప్పుకో. ఒక స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేసుకో. అంతేతప్ప చంద్రబాబునాయుడిగారితో పోల్చుకునే స్థాయి నీకు లేదు.  సీఎం పోస్టులో ఎవరున్నా గానీ వాళ్లకు మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి" అంటూ హితవు పలికారు.
Chandrababu
Divyavani
RGV
YSRCP
Jagan

More Telugu News