జగన్ గారు స్పందించడం చాలా సంతోషం కలిగించింది: వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ గారు స్పందించడం చాలా సంతోషం కలిగించింది: వర్మ

  • ఓ వ్యక్తిగా ఆయన స్పందించారు
  • ప్రజాస్వామ్యం పట్ల అందరూ అలాగే ముందుకు రావాలి
  • పోలీసులపై జగన్ వ్యాఖ్యలను ప్రస్తావించిన వర్మ
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కోసం విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టుకుందామని భావించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసుల కారణంగా తీవ్ర నిరాశకు గురికావడం తెలిసిందే. తనను విజయవాడ నుంచి పంపించేయడంపై ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. అయితే ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ స్పందించడంపై వర్మ సంతోషం వ్యక్తం చేశారు.

ఓ టీవీ చానల్ స్టూడియోలో కూర్చున్న వర్మ దీనిపై మాట్లాడుతూ, "ఆయన వైసీపీనా, మరో పార్టీకి చెందిన వ్యక్తా అని కాదు, ప్రజాస్వామ్యానికి భంగం కలిగినప్పుడు ఓ వ్యక్తిగా తను స్పందించారు. అది సంతోషించాల్సిన విషయం. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ అలాగే ముందుకు రావాలి" అంటూ పేర్కొన్నారు.

పోలీసులను బంట్రోతులుగా ఉపయోగించుకుంటున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా వర్మ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తనలాంటి వాడ్ని మరో చోటికి తరలించడానికి అంత పోలీస్ ఫోర్స్ అవసరమా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
RGV

More Telugu News