అదేమన్నా బాహుబలి సినిమానా? నేను ఏం మాట్లాడతానని చంద్రబాబు భయపడుతున్నారు?: వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అదేమన్నా బాహుబలి సినిమానా? నేను ఏం మాట్లాడతానని చంద్రబాబు భయపడుతున్నారు?: వర్మ

  • విజయవాడ రగడపై వర్మ ఆగ్రహం
  • లక్ష్మీస్ ఎన్టీఆర్ పెద్ద చిత్రం కాదు
  • ఆ సినిమా కారణంగా భయపడాల్సిన పనేముంది?
తనను విజయవాడలో అడుగుకూడా పెట్టనివ్వకుండా తిప్పిపంపడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీనిపై ఇవాళ ఓ టీవీ చానల్ లో చర్చలో పాల్గొని తన అభిప్రాయాలు వెల్లడించారు. తాను ఏం మాట్లాడతానని చంద్రబాబు భయపడుతున్నారో తెలియడంలేదని అన్నారు.

"పోలీసులను అడిగితే పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి, మమ్మల్నేమీ అడగొద్దంటున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో కొత్తగా తెలిపే విషయాలు ఏమున్నాయి! ప్రతివారం నాలుగైదు సినిమాలు వస్తుంటాయి. ఇందులో ఏంటి ప్రత్యేకత? అదేమీ బాహుబలి కాదు, ఎవరో చిన్న తారలు నటించిన సినిమా. దాని గురించి భయపడడంలో అర్థంలేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే సందేహం వస్తోంది. అయితే, ప్రెస్ మీట్ కు ముందస్తు అనుమతి తీసుకోకపోవడం నా తప్పే. ఆ మాత్రానికే ఈ విధంగా వ్యవహరించడం నాకు నచ్చలేదు" అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
RGV
Chandrababu

More Telugu News