గాంధీ ఆసుపత్రిని సందర్శించిన బ్రిటన్ రాణి కోడలు సోఫీ హెలెన్!

  • పీడియాట్రిక్, నియోనాటాలజీ వార్డుల పరిశీలన
  • డైమండ్ జూబ్లీ ట్రస్ట్ బాధ్యతలు చూస్తున్న సోఫీ
  • సేవలను స్వయంగా పరిశీలించేందుకు రాక
తెలంగాణలోని హైదరాబాద్ లో ఉన్న గాంధీ ఆసుపత్రికి ఈరోజు అనుకోని అతిథి వచ్చారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కోడలు సోఫీ హెలెన్ ఈరోజు గాంధీ ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పీడియాట్రిక్ వార్డులోని ఎన్‌ఐసీయూ, ఇంక్యుబేటర్‌, ఫ్రీ మెచ్యూర్డ్‌, ఇన్‌బోర్న్‌, అవుట్‌ బోర్న్‌ యూనిట్లతోపాటు నియోనాటాలజీ విభాగాన్ని పరిశీలించారు.

బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఆధ్వర్యంలో నడిచే డైమండ్ జూబ్లీ ట్రస్ట్ కు సోఫీ హెలెన్ వైస్ ప్యాట్రన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి చిన్న పిల్లల వార్డులో డైమండ్‌ జూబ్లీ ట్రస్ట్‌ అందిస్తున్న సేవలను స్వయంగా పరిశీలించేందుకు సోఫీ హెలెన్ విచ్చేశారు.
Go Back to Shorts
Telangana
Hyderabad
gandhi
hospital
sofie helen
british royal family

More Telugu News