హీరో ప్రభాస్‌ షూటింగ్‌ స్పాట్‌కు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరో ప్రభాస్‌ షూటింగ్‌ స్పాట్‌కు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి

  • ఆశ్చర్యపోయిన యూనిట్‌ సభ్యులు
  • ముంబయిలో జరుగుతున్న సాహో షూటింగ్‌
  • టీం సభ్యులతో కాసేపు ముచ్చటించిన బీజేపీ నేత
బాహుబలి సీక్వెల్‌తో జాతీయ స్థాయి గుర్తింపు సొంతం చేసుకున్న సినీనటుడు ప్రభాస్‌ ప్రస్తుతం తన సాహో సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం ముంబయి నగరంలోని ప్రత్యేక సెట్‌లో జరుగుతోంది. ఇటీవల షూటింగ్‌తో బిజీగా ఉన్న యూనిట్‌ సభ్యులు ఆశ్చర్యపోయే సంఘటన జరిగింది.

షూటింగ్‌ స్పాట్‌కు బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి రావడంతో అంతా కాసేపు నిశ్చేష్టులయ్యారు. అనుకోని అతిథి రావడంతో సెట్స్‌లో సందడి నెలకొంది. షూటింగ్‌ స్పాట్‌కు వచ్చిన గడ్కరి కాసేపు ప్రభాస్‌తోను, ఇతర యూనిట్‌ సభ్యులతోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటో ప్రస్తుతం వాట్సాప్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ముంబయిలో షెడ్యూల్‌తో చిత్ర నిర్మాణం పూర్తవుతుందని, పోస్టు ప్రొడక్షన్‌ పనులను పూర్తిచేసి ఆగస్టు 15 నాటికి సినిమా విడుదలకు ప్లాన్‌ చేస్తున్నట్లు నిర్మాత ప్రతినిధులు తెలిపారు.
Prabhas
nithin gadkari
saho
mumbai
shooting spot

More Telugu News