ఈ వయసులో ఎండలో పడి ఇక కట్ లు .. ఓకేలు చెప్పలేను!: యండమూరి

  • యండమూరి దర్శకత్వంలో 'దుప్పట్లో మిన్నాగు'
  • సినిమాలు రాకపోయినా హ్యాపీగానే వున్నాను
  •  మరో సినిమా చేసే ఆలోచన లేదు  
నవలా రచయితగా .. సినీ రచయితగా .. యండమూరి వీరేంద్రనాథ్ కి ఎంతో గుర్తింపు వుంది. అప్పుడప్పుడు ఆయన ఆట విడుపుగా దర్శకత్వం కూడా చేస్తుంటారు. అలా తాజాగా ఆయన 'దుప్పట్లో మిన్నాగు' సినిమాకి దర్శకత్వం వహించారు.

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "వరుసగా ఓ మూడు సినిమాలకి స్క్రీన్ ప్లే అందించాను .. ఆ మూడు సినిమాలు కూడా ఆడలేదు. సక్సెస్ లేకపోతే దర్శక నిర్మాతలు దగ్గరికి రారు. నీలో శక్తి ఉందా .. లేదా అనేది ఎవరూ చూడరు. సినిమా సక్సెస్ అయిందా లేదా అనేది మాత్రమే చూస్తారు. సినిమా అవకాశాలు రాకపోయినా నేను హ్యాపీగానే వున్నాను.  అవకాశాలు రావడం లేదుగదా అని నేను ఈ మాట అనడం లేదు. ఈ వయసులో ఎండలో పడి కట్ లు .. ఓకేలు చెప్పలేను. నాకు అంత ఓపిక లేదు .. నా వయసు వాళ్లంతా ఆల్రెడీ రిటైర్ అయ్యారు. ఈ సినిమా తరువాత మరో సినిమా చేసే ఆలోచన కూడా లేదు" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
yandamuri

More Telugu News