నేను పక్కా లోకల్... స్థానికేతరుడ్ని ఎలా అవుతాను?: ఢిల్లీ బీజేపీ అభ్యర్థి గంభీర్
- మా నాన్న 45 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం చేస్తున్నారు
- మోదీపై అభిమానంతోనే రాజకీయాల్లోకి వచ్చాను
- ప్రత్యర్థి వ్యాఖ్యలకు బదులిచ్చిన మాజీ క్రికెటర్
దేశానికి ప్రధానిగా నరేంద్ర మోదీ అందిస్తున్న సేవలతో ప్రభావితం అయ్యానని, ఆయన నాయకత్వాన్ని మరింత బలపర్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు వివరించారు. అయినా, తనను స్థానికేతరుడు, రాజకీయ పర్యాటకుడు అంటూ ప్రచారం చేయడం వెనుక కాంగ్రెస్ ఉద్దేశాలు ఏంటో తెలియడంలేదన్నారు. తాను ఎన్నికల్లో గెలిస్తే తూర్పు ఢిల్లీని అద్భుతమైన రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తానని గంభీర్ ధీమాగా చెప్పారు.