సంస్థల స్వయంప్రతిపత్తిని కాంగ్రెస్ హరిస్తోంది: బీజేపీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంస్థల స్వయంప్రతిపత్తిని కాంగ్రెస్ హరిస్తోంది: బీజేపీ

కాంగ్రెస్ పార్టీ రాజ్యంగబద్ధ సంస్థలు, కేంద్ర విచారణ సంస్థల స్వయంప్రతిపత్తిని హరిస్తోందంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ధ్వజమెత్తారు. యూపీఏ ప్రభుత్వం కాగ్, జేపీసీ, పీఏసీ అభిప్రాయాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మూడు వ్యవస్థల రక్షణకోసం బీజేపీ పోరాడుతోందని ఆయన స్పష్టం చేసారు. రాజ్యాంగ బద్ధంగా స్వయంప్రతిపత్తితో వ్యవహరించే స్వేచ్ఛ కాగ్ కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం గుర్తు చేసారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఎంపీలను ఇస్తే ... కుంభకోణాల్లో మునిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వీరు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో హోం మంత్రితో పాటూ ఆరుగురు మంత్రులు సీబీఐ ఛార్జిషీటులో నిందితులుగా ఉండడమే వారి అవినీతికి పరాకాష్ఠ అని ఈ రోజు హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు.

More Telugu News