పదో తరగతి ఫెయిల్ అవుతానన్న భయంతో ప్రాణాలు తీసుకున్న బాలుడు!
- తెలంగాణలోని హైదరాబాద్ లో ఘటన
- ఫలితాలపై నమ్మకం కోల్పోయిన విద్యార్థి
- ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణం
అయితే తాను పాస్ కాలేనని భయపడ్డాడు. ఒకవేళ ఫెయిల్ అయితే తల్లిదండ్రులకు ముఖం చూపించలేనని మనోవేదనకు గురయ్యాడు. చివరికి ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు ఎంతకూ గది నుంచి బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు గది తలుపును బలవంతంగా తీశారు. లోపల ఫ్యాన్ కు వేలాడుతున్న పిల్లాడిని కిందకు దించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
కాగా, బాలుడిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన ఛత్రినాక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పోస్ట్ మార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.