ఉద్యోగం వదిలేసి సినిమాల వైపు వచ్చాను: నవీన్ చంద్ర
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉద్యోగం వదిలేసి సినిమాల వైపు వచ్చాను: నవీన్ చంద్ర

  • చిన్నప్పటి నుంచి అల్లరి ఎక్కువ చేసేవాడిని
  •  ఉద్యోగం మానేసి ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డాను
  •  'అందాల రాక్షసి'లో అలా ఛాన్స్ వచ్చింది  
'అందాల రాక్షసి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర, ఒక వైపున హీరోగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే, మరో వైపున ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను సినిమాల వైపు రావడానికి దారితీసిన పరిస్థితులను గురించి చెప్పుకొచ్చాడు.

"స్కూల్ డేస్ నుంచి నేను చాలా అల్లరి పనులు చేసేవాడిని. కాలేజ్ రోజుల్లోనూ అదే తీరు. అమ్మ కంట్లోపడి చీవాట్లు తిన్న రోజులు చాలానే వున్నాయి. మొత్తానికి ఇంజనీరింగ్ పూర్తి చేసి .. ఉద్యోగంలో చేరాను. ఒక సందర్భంలో నాపై ఆఫీసర్ నా మనసుకి కష్టం కలిగేలా మాట్లాడాడు. అంతే, చేస్తున్న పనిని ఆ క్షణమే ఆపేసి బయటికి వచ్చాను. మొదటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండటంతో, ఆ దిశగా ప్రయత్నాలను మొదలెట్టాను. ఆర్థికపరమైన ఇబ్బందులను తట్టుకుంటూ ముందుకువెళ్లాను. చిన్నచిన్న పాత్రలు చేస్తోన్న సమయంలోనే, లక్ష్మీ భూపాల్ అనే రైటర్ తో పరిచయమైంది. ఆయన ద్వారానే 'అందాల రాక్షసి'లో అవకాశం వచ్చింది" అని అన్నాడు. 
naveen chandra

More Telugu News