హైదరాబాద్ పోలీసులకు ఈ వేసవిలో చల్లచల్లగా సమ్మర్ కిట్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ పోలీసులకు ఈ వేసవిలో చల్లచల్లగా సమ్మర్ కిట్లు!

  • మంచినీళ్ల సీసా, మజ్జిగ ప్యాకెట్లు
  • గ్లూకోజ్ ప్యాక్ లు, కూలింగ్ జాకెట్లు
  • కానిస్టేబుళ్ల ఆరోగ్యం కోసం టీ సర్కారు చర్యలు
మండు వేసవిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్లు అందజేశారు. భానుడి భగభగలను తట్టుకుంటూనే రోడ్లపై నిలుచుని విధులు నిర్వర్తించాల్సిన ట్రాఫిక్ పోలీసుల రిలీఫ్ కోసం ఈ కిట్లు ఉపయోపడతాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో కిట్ లో మంచినీళ్ల సీసా, మజ్జిగ ప్యాకెట్, కాలర్ లైట్, చలువ కళ్లద్దాలు, ముక్కుకు ధరించే మాస్క్, రిఫ్లెక్టివ్ జాకెట్, గ్లూకోన్-డి ప్యాకెట్, కూలింగ్ వెస్ట్ ఉంటాయి. మొత్తం 2,400 మంది ట్రాఫిక్ పోలీసులకు ఈ సమ్మర్ కిట్లు పంపిణీ చేశారు.
Hyderabad
Police

More Telugu News