నేనిప్పుడు వరల్డ్ హీరోయిన్ ను... గెలిచేశానోచ్: నటి శ్రీరెడ్డి

  • టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై కమిటీ
  • కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన శ్రీరెడ్డి
  • ఉద్యమంలో సాయపడిన వారికి కూడా
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై సానుకూలంగా స్పందించిన కేసీఆర్ సర్కారు, ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ జీవోను విడుదల చేయగా, తన కల ఇప్పటికి సాకారమైందని, అవకాశాల పేరిట అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నారంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురి పేర్లను బయటపెట్టి సంచలనం రేపిన నటి శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెడుతూ, కమిటీని ఏర్పాటు చేసిన కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

తన పోరాటం ఫలించిందని, తాను గెలిచానని, ఇప్పుడు ప్రపంచానికే హీరోయిన్ అయినంత సంతోషంగా ఉందని వ్యాఖ్యానించింది. తాను చేసిన ఉద్యమంలో సాయపడిన నటి అపూర్వ సహా మిగతా మిత్రులు, స్నేహితులకు కృతజ్ఞతలు చెప్పింది. కాగా, బుధవారం నాడు టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై కమిటీని ఏర్పాటు చేస్తూ, ప్రభుత్వం జీవో నంబర్ 984 ను విడుదల చేసింది.
Go Back to Shorts
Sri Reddy
Tollywood
Casting Couch
KCR
Committe

More Telugu News