'ఆర్ ఎక్స్ 100' దర్శకుడితో నాగచైతన్య?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆర్ ఎక్స్ 100' దర్శకుడితో నాగచైతన్య?

  • 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో భారీ విజయం 
  • రామ్ .. బెల్లంకొండలతో పట్టాలెక్కని ప్రాజెక్టులు
  •  యాక్షన్ నేపథ్యంలో చైతూ సినిమా  
నాగచైతన్య కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన 'మజిలీ' భారీ విజయాన్ని అందుకుంది. చైతూ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను వసూళ్ల పరంగా ఈ సినిమా తన జోరును కొనసాగిస్తూనే వుంది. ఈ నేపథ్యంలో 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతితో చైతూ ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

'ఆర్ ఎక్స్ 100' భారీ సక్సెస్ తరువాత అజయ్ భూపతితో సినిమాలు చేయడానికి యువ కథానాయకులు చాలామంది పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే ఆయన రామ్ తో సినిమా చేయడానికి సిద్ధపడ్డారు. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు సెట్ కాకపోవడం వలన, బెల్లంకొండ శ్రీనివాస్ తో చేయాలనుకున్నారు. అక్కడ ఏం జరిగిందో తెలియదుగానీ, తాజాగా ఆయన అన్నపూర్ణ కాంపౌండ్ లో అడుగుపెట్టినట్టుగా చెబుతున్నారు. చైతూ హీరోగా యాక్షన్ నేపథ్యంలో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 
chaithu
ajay

More Telugu News