వచ్చేనెలలోనే సప్తగిరి సందడి
Add ap7am to your home Screen

వచ్చేనెలలోనే సప్తగిరి సందడి

  • సప్తగిరి తాజా చిత్రంగా 'వజ్రకవచధర గోవింద'
  • డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న సప్తగిరి
  • మే నెలలో ప్రేక్షకుల ముందుకు        
హాస్యనటుడిగా చాలా తక్కువ కాలంలో సప్తగిరి తనదైన ముద్రవేశాడు. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రను ఎంతో యాక్టివ్ గా ముందుకు తీసుకెళ్లడం, తనదైన మాండలికంతో అలరించడం సప్తగిరి ప్రత్యేకత. సప్తగిరి తెరపై కనిపిస్తే టైమే తెలియదని ప్రేక్షకులు అనుకునే స్థాయికి ఆయన చేరుకున్నాడు. కథానాయకుడిగా ఆయన చేసిన తాజా చిత్రం 'వజ్రకవచధర గోవింద'. నరేంద్ర .. జీవియన్ రెడ్డి నిర్మాతలుగా, అరుణ్ పవార్ దర్శకుడిగా ఈ సినిమా నిర్మితమైంది.

 సప్తగిరి జోడిగా వైభవి నటించిన ఈ సినిమాను, మే నెలలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా టైటిల్ కొత్తగా వుంది. కాషాయ వస్త్రాలు .. కమండలం .. మెడలో రుద్రాక్షలు ధరించి కొత్తగా సప్తగిరి కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన హిట్ కొట్టడం ఖాయమేననే టాక్ వినిపిస్తోంది. ఇక కామెడీని ఇష్టపడేవారు మాత్రం, సప్తగిరి ఒక వైపున హీరోగా చేస్తూ .. మరో వైపున కమెడియన్ గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెరపై సప్తగిరి కనిపిస్తే కలిగే సందడి వేరు.
saptagiri
vabhavi

More Telugu News