'భీష్మ'లో నితిన్ జోడీగా కనిపించేది రష్మిక మాత్రమే

  • వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' 
  • కల్యాణి ప్రియదర్శన్ ను తీసుకోలేదు
  •  త్వరలోనే సెట్స్ పైకి    
నితిన్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలు వున్నాయి. ఈ మూడింటిలో ముందుగా ఆయన 'భీష్మ' సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్నాడు. 'ఛలో' సినిమాతో మంచి ప్రేమకథా చిత్రాన్ని అందించిన వెంకీ కుడుముల, నితిన్ తో చేసేది కూడా ప్రేమకథా చిత్రమే.

ఇక ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందనను తీసుకున్నారని, మరో కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ ను తీసుకున్నారనే వార్త రెండు మూడు రోజులుగా షికారు చేస్తోంది. తాజాగా ఈ విషయంపై దర్శకుడు వెంకీ కుడుముల స్పందించాడు. ఈ సినిమాలో ఒక కథానాయిక మాత్రమే ఉంటుందనీ, ఆ పాత్రకి రష్మికను తీసుకోవడం జరిగిపోయిందని అన్నాడు. మరో కథానాయిక అవసరం లేదనీ, కల్యాణి ప్రియదర్శన్ ను ఎంపిక చేసుకున్నామనే వార్తలో నిజం లేదని స్పష్టం చేశాడు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నామనే విషయాన్ని తెలియజేశాడు.
Go Back to Shorts
nithin
rashmika

More Telugu News