నా అభిమాన హీరో ఆయనే: 'జబర్దస్త్' వినోదిని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా అభిమాన హీరో ఆయనే: 'జబర్దస్త్' వినోదిని

  • ఎన్టీఆర్ .. శోభన్ బాబు ఇష్టం 
  • బ్రహ్మానందం గారంటే ప్రత్యేక అభిమానం
  •  నాని కష్టపడి పైకి వచ్చాడు  
'జబర్దస్త్' కామెడీ షో ఎంత పాప్యులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ కామెడీ షో ద్వారా మంచిపేరు తెచ్చుకున్న నటుల జాబితాలో వినోద్ (వినోదిని) ఒకరుగా కనిపిస్తాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

"తెలుగు తెరపై సందడి చేసే హీరోలంతా నాకు ఇష్టమే. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత నాకు నచ్చుతుంది. సీనియర్ హీరోల్లో ఎన్టీ రామారావుగారు .. శోభన్ బాబుగారు అంటే ఇష్టం .. ఇప్పటి హీరోల్లో 'నాని' అంటే ఎక్కువ ఇష్టం. ఎంతో కష్టపడి ఆయన ఈ స్థాయికి వచ్చాడు. ఇక హాస్యాన్ని ప్రేమించే ఒక నటుడిగా చెప్పాలంటే 'బ్రహ్మానందం' గారు అంటే అంతులేని అభిమానం. నిన్నటి తరం హీరోయిన్స్ లో సౌందర్య .. రమ్యకృష్ణ అంటే ఇష్టం. ఈ తరం కథానాయికలలో దీపికా పదుకొనె .. ఇలియానా అంటే అభిమానం" అని చెప్పుకొచ్చాడు. 
vinodini

More Telugu News