'అందాల రాక్షసి' సినిమాతో నవీన్ చంద్రకి యూత్ లో మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆ తరువాత వచ్చిన సినిమాలు ఆయన కెరియర్ కి పెద్దగా హెల్ప్ కాలేదు. దాంతో అవకాశాలు తగ్గుతూ రావడంతో, ముఖ్యమైన పాత్రలను చేస్తూ కెరియర్ ను నెట్టుకొస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే 'అరవింద సమేత'లో నవీన్ చంద్ర చేసిన పాత్ర ఆయనకి మరికొన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. ఆ అవకాశాల్లో హీరో పాత్రలు ఉండటం విశేషం.

 'అరవింద సమేత' తరువాత ధనుశ్ కి విలన్ గా ఒక తమిళ సినిమాను అంగీకరించిన నవీన్ చంద్ర, తెలుగులో హీరోగా రెండు సినిమాలను అంగీకరించాడు. ఒకటి '28 డిగ్రీస్ సెంటీగ్రేడ్' అయితే, తాజాగా మరో సినిమా ఈ రోజున పూజా కార్యక్రమాలను జరుపుకుంది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకి వేణు మాదికంటి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. మొత్తానికి నవీన్ చంద్ర ఒక వైపున విలన్ వేషాలు వేస్తూనే .. మరో వైపున హీరోగా బిజీ అవుతున్నాడన్న మాట.